బిజినెస్

హిందుస్థాన్ జింక్‌కు ధరల కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో గతంతో పోల్చితే 26 శాతం పెరిగి 2,319 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,839.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హిందుస్థాన్ జింక్ తెలిపింది. అమ్మకాలు ఈసారి 5,348 కోట్ల రూపాయలుగా, నిరుడు 3,676 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. 2016వ సంవత్సరం జింక్ ధరలు 55 శాతానికిపైగా పెరిగాయని, జింక్ పరిశ్రమకు ఎంతో కలిసొచ్చిన ఏడాది అని సంస్థ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు.