బిజినెస్

దేశాన్ని వీడితే తీవ్ర పర్యవసానాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 11: విదేశాలకు మకాం మార్చుకోవాలని ఆలోచిస్తున్న దేశీయ కంపెనీలు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉద్యోగులను విడిచిపెట్టి, కేవలం బై బై చెప్పి వెళ్లిపోవడం ఇటువంటి సంస్థలకు అనుకున్నంత సులువు కాబోదని, ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తామని ఆయన వారాంతపు రేడియో ప్రసంగంలో స్పష్టం చేశారు. అలాగే అమెరికన్ కార్మికులతో పాటు వ్యాపారులపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా కీలక సంస్కరణను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలైందని ఆయన చెప్పారు. ‘అమెరికాలో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసేందుకు కృషి చేయడంతోపాటు దేశంలోని కంపెనీలు విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు నిబంధనలు కఠినతరం చేయబోతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం తాను ప్రముఖ ఐటి దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ సిఇఒ బ్రియాన్ క్రానిచ్‌తో భేటీ అయ్యానని, అరిజోనాలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లను వెచ్చిస్తామని ఆయన ప్రకటించడం హర్షణీయమని ట్రంప్ అభినందించారు. ‘అమెరికాలో కొత్త ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు రావాలన్నది మా ఆకాంక్ష. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామన్న విషయం ఇంటెల్ సంస్థకు తెలుసు. అందుకే ఆ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది’ అని ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో గొప్ప ఉద్యోగాలకు అమెరికాను నెలవుగా తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నామని, అయితే వ్యర్థమైన నిబంధనలను తొలగించడంతోపాటు మితిమీరిన పన్నుల భారాన్ని తగ్గించి కంపెనీల్లో పోటీ తత్వాన్ని పెంపొందించకపోతే ఇది సాధ్యం కాబోదని ఆయన అన్నారు.