బిజినెస్

నష్టాల్లోకి ఐడియా సెల్యులార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ ఏకీకృత నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 383.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 659.35 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఐడియా సెల్యులార్ అందుకుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత వాయిస్, డేటా సేవల నేపథ్యంలో ఐడియాకు నష్టాలు రావడం గమనార్హం. ఆదాయం కూడా గతంతో పోల్చితే 9,032.43 కోట్ల రూపాయల నుంచి 8,706.36 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ మేరకు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఐడియా సెల్యులార్ తెలియజేసింది.
జెపి అసోసియేట్స్ నష్టం
రూ. 1,095 కోట్లు
జైప్రకాశ్ అ సోసియేట్స్ స్టాండలోన్ నికర నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,095.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 827.26 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,648.87 కోట్ల రూపాయలుగా ఉండగా, పోయినసారి 2,121.59 కోట్ల రూపాయలుగా ఉంది.