బిజినెస్

ప్యూగోట్ చేతికి అంబాసడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంబాసడర్.. సంపన్న వర్గాలకు ప్రతిబింబం. రాజకీయ ఠీవీకి, అధికార దర్పానికి చిహ్నాం. కాలం మారినా.. రోజులు గడిచినా.. అంబాసడర్ రాజసం మాత్రం అలాగే ఉండిపోయిందనడం అతిశయోక్తి కాదు. అత్యాధునిక సౌకర్యాలతో, నిత్యనూతన మోడళ్లతో కార్లు వస్తున్నా.. వాటిని అంబాసడర్‌తో పోల్చేవారు ఇప్పటికీ లేరంటే దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. అందుకే అంబాసడర్ బ్రాండ్‌కు ఎనే్నళ్లయినా, ఎన్నాళ్లయినా ఆదరణ అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు అంబాసడర్‌కు కొత్త యాజమాన్యం వచ్చింది. సికె బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ మోటార్స్ నుంచి అంబాసడర్‌ను యూరోపియన్ ఆటో దిగ్గజం ప్యూగోట్ చేజిక్కించుకుంది. 80 కోట్ల రూపాయలకు అంబాసడర్ బ్రాండ్, ట్రేడ్‌మార్క్‌లను ప్యూగోట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఓ ఒప్పందం కూడా ప్యూగోట్‌తో హిందుస్థాన్ మోటార్స్ కుదుర్చుకుంది. ప్రస్తుతం అంబాసడర్ కార్ల తయారీ ఆగిపోయిందన్న విషయం తెలిసిందే. కాగా, భారతీయ మార్కెట్‌లో పునఃప్రవేశానికి సికె బిర్లాతో కలిసి ప్యూగోట్.. తమిళనాడులో దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడితో వాహన, పవర్‌ట్రైన్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికి సంబంధించిన భాగస్వామ్య ఒప్పందాన్ని సికె బిర్లా గ్రూప్‌తో ప్యూగోట్ గత నెలే చేసుకుంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం లక్ష వాహనాలు. ప్రస్తుతం 3 మిలియన్ల కార్లుగా ఉన్న భారతీయ ఆటోమోటివ్ మార్కెట్.. 2025 నాటికి 8-10 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దీంతో ప్యూగోట్ మళ్లీ భారత మార్కెట్ వైపు చూస్తోంది. గతంలో సిట్రాన్, డిఎస్ మోడళ్లతో ప్యూగోట్ భారత్‌లో కార్లను అమ్మింది. అయితే వీటికి అంతగా ఆదరణ లభించలేదు. దీంతో దేశీయ మార్కెట్‌కు దూరమైన ప్యూగోట్.. తిరిగి ఇప్పుడు చారిత్రాత్మక అంబాసడర్ బ్రాండ్ కొనుగోలుతో దగ్గరవుతోంది.