బిజినెస్

విశాఖ ఉక్కుకు ‘నీటి’ గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు నీటి సమస్య వచ్చిపడింది. ఉత్పత్తికి అవసరమైన నీటిని సరఫరా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లే వ్యవహరిస్తోంది. దీంతో నీటి కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకునే దుస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు నిత్యం 35 ఎంజిడి (మిలియన్ గేలన్స్ ఫర్ ఎ డే) నీరు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం 20 ఎంజిడి నీరు కూడా సరఫరా కావడం లేదు. ఆపత్కాల సమయంలో పరిశ్రమ నీటి అవసరాల కోసం కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కెబిఆర్)ను నిర్మించారు. పరిశ్రమ అవసరాలను 90 రోజుల పాటు తీర్చగలిగే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉంది. అయితే గోదావరి నుంచి కర్మాగారానికి నీటి సరఫరా సగానికిపైగా పడిపోవడంతో కెబిఆర్ బీడు వారుతోంది. సుమారు 3,000 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 700 ఎంజిడి నీరు మాత్రమే నిల్వ ఉంది. మరోవైపు విశాఖ ఉక్కు నీటి సరఫరాలో కీలక భూమిక పోషించే విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కార్పొరేషన్ (విస్కో) తీరుతో ఉక్కుకు నీటి కష్టాలు మరింత పెరిగాయి. విశాఖ ఉక్కుకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత ఏలేరు కాలువ నిర్వాహణకు విస్కోకు అప్పగించారు. ఉక్కు కర్మాగారంతోపాటు సింహాద్రి ఎన్టీపిసి, ఫార్మాసిటీ, తదితర పరిశ్రమలకు ఏలేరు ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. అయతే పరివాహక ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి నిండుకోవడంవల్ల ఏలేరు ద్వారా విశాఖకు నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు 300 క్యూసెక్కుల నీటిని గోదావరి, ఏలేరు రిజర్వాయర్ల నుంచి విశాఖకు తరలించాల్సి ఉంది. దీనిలో ఉక్కు కర్మాగారం, ఇతర పారిశ్రామిక అవసరాలతోపాటు విశాఖ నగరవాసుల తాగునీటి అవసరాలు తీరాల్సి ఉంది. అయితే గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడం, ఏలేరు రిజర్వాయర్‌లో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో గత రెండు నెలలుగా పంపింగ్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. అయితే కెబిఆర్‌కు చేరుకునే సరికి 40 శాతం నీరు వృథా అవుతోంది. కాలువలో పేరుకుపోయిన పూడిక, రైతుల నీటి చౌర్యం తదితర అంశాలు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఉత్పత్తి తగ్గించిన యాజమాన్యం
నీటి సరఫరా సగానికి పడిపోవడంతో పరిశ్రమ యాజమాన్యం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొన్ని యూనిట్లలో ఉత్పత్తిని సగానికి తగ్గించుకుంది. కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, కోక్ ఓవెన్, స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్‌ఎంఎస్)లను యథావిధిగా నిర్వహిస్తూ, మిగిలిన యూనిట్లలో మాత్రం ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. వైర్ రాడ్ మిల్స్ (డబ్ల్యుఆర్‌ఎం), లైట్ అండ్ మీడియం మర్చంట్ మిల్ (ఎల్‌ఎంఎంఎం), మీడియం మర్చంట్ స్ట్రక్చరల్ మిల్ (ఎంఎంఎస్‌ఎం)లో ఉత్పత్తిని 50 శాతానికి కుదించారు. భవిష్యత్‌లో నీటి లభ్యత పూర్తిగా పడిపోతే బ్లాస్ట్ఫ్‌ర్నేస్, కోక్‌ఓవెన్, ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే నిర్వహించేలా ప్రతిపాదనలున్నాయి. అయతే విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న నీటి కొరతను తక్షణమే నివారించేందుకు సీలేరు జలాశయం నుంచి గోదావరి ద్వారా ఏలేరు కాలువకు నీటిని తరలించాల్సి ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడకే ప్రమాదమంటున్నారు.