బిజినెస్

జూమ్ ఎయిర్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గాపూర్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ ప్రవేశించింది. ఈ నెల 15 నుంచి జూమ్ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీ నుంచి జూమ్ ఎయిర్ విమానం ఎగరగా, మధ్యాహ్నం ఒంటి గంట 39 నిమిషాలకు దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్) లోగల ఖాజీ నజ్రుల్ ఇస్లాం ఎయిర్‌పోర్టు వద్ద దిగింది. జూమ్ ఎయిర్‌కు చెందిన ఈ సిఆర్‌జె 200 ఎల్‌ఆర్ విమానానికి ఇక్కడ సంప్రదాయం ప్రకారం వాటర్ క్యానన్ శాల్యూట్‌ను నిర్వహించారు. కాగా, జూమ్ ఎయిర్.. దేశీయ విమానయాన రంగంలో 12వ సంస్థ. ఫిబ్రవరి 15న ఢిల్లీ నుంచి కోల్‌కతా మీదుగా దుర్గాపూర్‌కు తొలి విమానం నడుస్తుంది. జెక్సస్ ఎయిర్ సర్వీసెస్ నాయకత్వంలోని జూమ్ ఎయిర్.. ఢిల్లీ నుంచి అమృత్‌సర్, సూరత్, భావనగర్‌లకూ విమానాలను నడపనుంది.
తొలి దశలో భాగంగా మూడు సిఆర్‌జె 200 ఎల్‌ఆర్ విమానాలతో సేవలు ప్రారంభిస్తుండగా, త్వరలోనే దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తారిస్తామని, గడచిన రెండేళ్లలో భారతీయ విమానయాన రంగం 20 శాతానికిపైగా వృద్ధిరేటును అందుకుందని, ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, రాంచీ, చంఢీగఢ్ తదితర ప్రాంతాలకు విమానాల రద్దీ పెరిగిందని జూమ్ ఎయిర్ డైరెక్టర్, సిఇఒ కోస్తవ్ మోహన్ దార్ అన్నారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, మరిన్ని పెట్టుబడులు పెడతామని, తిరుపతి, విజయవాడ, ముంబయి, షిల్లాంగ్, ఐజ్వాల్, పాసిఘట్, జీరో, అలహాబాద్, గోరఖ్‌పూర్, ఇండోర్, భోపాల్ ప్రాంతాలకు రోజువారి సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా, ఎయిర్ కోస్టా, ట్రూజెట్, అలయెన్స్ ఎయిర్, ఎయిర్ కార్నివాల్ సంస్థలు విమాన సేవలను అందిస్తున్నాయి. వీటి సరసన ఇప్పుడు 12వ సంస్థగా జూమ్ ఎయిర్ చేరుతోంది. కాగా, ఎయిర్ పెగాసుస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతబడ్డాయి.