బిజినెస్

హెచ్‌పిసిఎల్‌కు అమ్మకాల దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రభుత్వరంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 53 శాతం ఎగిసి 1,590 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,041 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం హెచ్‌పిసిఎల్ సిఎండి ముకేశ్ కె సురానా ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అమ్మ కాలు అధికంగా జరగడమే లాభాలకు కారణమన్నారు.
అసోచామ్ నూతన అధ్యక్షుడిగా సందీప్ జజోడియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: పారిశ్రామిక సంఘం అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా మొనె్నట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) సందీప్ జజోడియా నియమితులయ్యారు. వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బాలకృష్ణన్ గోయెంకా సీనియర్ ఉపాధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వైస్-చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోచామ్ నూతన అధ్యక్షుడు సందీప్ జజోడియా మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికాభివృద్ధికి అసోచామ్ తోడ్పడుతుందని, భారతీయ సంస్థల సాధికారికతకు కృషి చేస్తుందని అన్నారు.
ఐపిపిబికి రూ. 500 కోట్ల ప్రభుత్వ సాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి)కు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా 650 శాఖలను ఏర్పాటు చేయాలని ఇండియా పోస్ట్ భావిస్తున్నది తెలిసిందే. కాగా, 125 కోట్ల రూపాయలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కోసం కార్పొరేట్ సంస్థలోకి పెట్టుబడులుగా పంపిస్తున్న కేంద్రం.. 375 కోట్ల రూపాయలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్థిక సాయంగా అందిస్తోంది.