బిజినెస్

ఎయిర్ కనెక్టివిటీని పెంచుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. మంత్రి అశోగజపతిరాజుతో ముఖాముఖి కార్యక్రమాన్ని పారిశ్రామిక సంఘం సిఐఐ సోమవారం ఇక్కడ నిర్వహించింది. ఈ సందర్భంగా సింబయాసిస్ అధినేత ఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖలో ఎయిర్ కార్గో సౌకర్యం లేకపోవడం వలన బ్రాండిక్స్, ఫార్మా కంపెనీలు చెన్నై నుంచి సరకును ఎగుమతి చేసుకోవలసి వస్తోందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. దేశంలో ఎయిర్ కార్గోకు పెద్దగా డిమాండ్ లేదన్నారు. ఒక్క చెన్నై నుంచే ఎయిర్ కార్గో రవాణా జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ విశాఖలో ఎయిర్ కార్గో విమాన సర్వీసులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. కాగా, దేశంలో ఉన్న విమానాశ్రయాల్లో 70 మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని చెప్పారు. విశాఖ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాన్ని కేంద్రం గుర్తించిందని అశోక్ చెప్పారు. అందుకే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి భూసేకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఆయన తెలియచేశారు. రాజమండ్రి, గన్నవరం, తిరుపతి ఎయిర్‌పోర్టులను 1,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖ ఎంపి హరిబాబు మాట్లాడుతూ విశాఖకు కేంద్రం 35 ప్రాజెక్ట్‌లు మంజూరు చేసిందని, ఇవన్నీ అందుబాటులో వచ్చే నాటికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆవశ్యకత పెరుగుతుందని చెప్పారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రావడం శుభ సూచకంగా అభివర్ణించారు.
సిఐఐ నూతన కార్యవర్గం
ఈ సందర్భంగా సిఐఐ విశాఖపట్నం జోన్ వచ్చే 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంది. అధ్యక్షునిగా దాట్ల తిరుపతిరాజు, ఉపాధ్యక్షునిగా జి మురళీకృష్ణ ఎన్నికయ్యారు.

చిత్రం..సిఐఐ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు