బిజినెస్

ఒఎన్‌జిసి చేతికి హెచ్‌పిసిఎల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పత్తి దిగ్గజం ఒఎన్‌జిసి.. దేశీయ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థల్లో మూడో అతిపెద్దదైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)ను హస్తగతం చేసుకునే అవకాశాలున్నాయి. దాదాపు 44,000 కోట్ల రూపాయల (6.6 బిలియన్ డాలర్లు)తో హెచ్‌పిసిఎల్‌ను ఒఎన్‌జిసి చేజిక్కించుకునే వీలుంది. ఓ సమగ్ర చమురు దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగమే ఈ ఒఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్ కలయిక. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఈ మేరకు సంకేతాలను ఇచ్చారు కూడా. ఓ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కంపెనీ సృష్టికి హెచ్‌పిసిఎల్‌లోగల 51.11 శాతం ప్రభుత్వ వాటాను, 26 శాతం ఓపెన్ మార్కెట్ వాటాను ఒఎన్‌జిసి కొనుగోలు చేయవచ్చని, ఇందుకు 44,000 కోట్ల రూపాయలు వెచ్చించవచ్చని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కాగా, చమురు, గ్యాస్ రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం ఆరు మాత్రమే ఉండగా, అందులో ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) ఉత్పత్తిదారులుగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), హెచ్‌పిసిఎల్, భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్) రిఫైనరీ, మార్కెటింగ్ సంస్థలుగా, గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ ఆపరేటర్‌గా ఉన్నాయి. ఇక ఈ సంస్థలకు ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ (ఒవిఎల్), చెన్నై పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (సిపిసిఎల్), నుమలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్, మంగళూర్ రిఫైనరీ (ఎమ్‌ఆర్‌పిఎల్) సంస్థలు అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఇదిలావుంటే హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్‌ను ఒఎన్‌జిసితో ఐఒసిని ఆయిల్ ఇండియతో కలిపే వీలుందని, దీనివల్ల రెండు భారీ ప్రభుత్వరంగ చమురు సంస్థలు అవతరిస్తాయని ఆ అధికారి అన్నారు. అయితే బిపిసిఎల్‌ను విడిగానే ఉంచొచ్చని, అది భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్‌లో ఇప్పటికే అగ్రశ్రేణి అనుబంధ సంస్థగా ఉందని చెప్పారు. భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ మున్ముందు బలోపేతం కావడానికి విస్తృత అవకాశాలున్నందున బిపిసిఎల్‌ను ఎందులోనూ విలీనం చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఒఎన్‌జిసిలో కలిసిపోవడం వల్ల హెచ్‌పిసిఎల్ చమురు శుద్ధి సామర్థ్యం ఏటా అదనంగా 23.8 మిలియన్ టన్నులు పెరగనుంది. దీంతో దేశీయ చమురు శుద్ధి సంస్థల్లో ఐఒసి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత హెచ్‌పిసిఎల్ మూడో అతిపెద్ద సంస్థగా అవతరించనుంది. అయితే రెండు ప్రభుత్వరంగ సంస్థలే అయినందున హెచ్‌పిసిఎల్ వాటాను ఒఎన్‌జిసి కొనుగోలుకు కేబినెట్ నుంచి రెండు ఆమోదాలు లభించాల్సి ఉంది. ఒకటోది వాటా అమ్మేందుకు హెచ్‌పిసిఎల్‌కు, రెండోది ఆ వాటాను కొనేందుకు ఒఎన్‌జిసికి కేబినెట్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.