బిజినెస్

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఔట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌తోపాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లు, డేటా వినియోగంపై అన్ని రకాల రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయానికి రాగా, భారతీయ టెలికామ్ రంగంలో ఇక జియో, ఎయిర్‌టెల్ మధ్య గట్టి పోటీ ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, అంతర్జాతీయ కాల్ రేట్లను, డేటా చార్జీలనూ ఎయిర్‌టెల్ భారీగా తగ్గించింది. కాల్ రేటును 90 శాతం వరకు దించి నిమిషానికి 3 రూపాయలుగా చేస్తే, డేటా వినియోగ చార్జీని 99 శాతం వరకు కోసేసి ఒక మెగాబైట్ (ఎమ్‌బి)కు 3 రూపాయలుగా నిర్ణయించింది. అన్ని పాపులర్ రోమింగ్ డెస్టినేషన్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇక ‘ఏప్రిల్ 1 నుంచి జాతీయ రోమింగ్ అనేదే ఉండదు.’ అని ఓ పత్రికా ప్రకటనలో ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ‘రోమింగ్‌పై ఎయిర్‌టెల్ యుద్ధాన్ని ప్రకటించింది.’ అని కూడా ఆ ప్రకటనలో తెలిపింది. రోమింగ్ ప్యాక్‌లను కస్టమర్లు ప్రత్యేకంగా కొనకున్నా కూడా విదేశీ రోమింగ్ చార్జీల భయం అక్కర్లేదని డైలీ ప్యాక్‌లలో అది సర్దుబాటు అవుతుందని తెలిపింది.
బిల్లు షాకులు ఇక గతమేనని, అధిక కాల్/డేటా చార్జీలు అనేది మరిచిపోవచ్చన్న భరోసాను ఇచ్చింది. అంతర్జాతీయ రోమింగ్ కోసం ఇప్పటికే సరికొత్త, చౌక ధరలతో కూడిన ప్యాక్‌లను ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేశాలకు వర్తించేలా అందుబాటులోకి తెచ్చామని ఎయిర్‌టెల్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ ప్యాక్‌లు ఒక రోజు, 10 రోజులు, 30 రోజుల కాలపరిమితితో ఉన్నాయని వివరించింది. కాగా, ప్రస్తుతం ఉచిత కాల్స్, డేటా ఆఫర్లతో మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో.. ఏప్రిల్ 1 నుంచి డేటా చార్జీలను ప్రకటించినది తెలిసిందే. రోమింగ్ చార్జీలను జియో ఎత్తివేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో పయనించింది. దీంతో మిగతా సంస్థలపై ఈ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని, కాబట్టి అవికూడా రోమింగ్ చార్జీలను ఎత్తివేయక తప్పని పరిస్థితి అంటూ మార్కెట్ వర్గాలు తాజా పరిణామాలను విశే్లషిస్తున్నాయి.