బిజినెస్

నగదు లావాదేవీలే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: నగదు రహిత లావాదేవీలే ముద్దు అని ఓ వైపు భారత్ అంటుంటే, మరోవైపు నగదు లావాదేవీలే ముద్దు అని స్విట్జర్లాండ్ చెబుతోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నగదు రహిత లావాదేవీలే చక్కని మార్గమని భావించిన కేంద్రం.. నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే. అయితే సోమవారం రాత్రి బాసెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాంక్‌నోట్ సదస్సులో స్విస్ నేషనల్ బ్యాంక్ డిప్యూటి అధిపతి రిట్జ్ జుబ్రు ఎగ్ మాట్లాడుతూ నగదు లావాదేవీలనే సమర్థించారు. సాధారణ ప్రజానీకం ఇప్పటికీ నగదునే ఇష్టపడుతున్నారన్న ఆయన నోట్ల రద్దును ఖండించారు. తాము అలాంటి నిర్ణయానికి పోబోమన్నారు.