బిజినెస్

దొనకొండలో వాహనాల పరిశోధన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, మార్చి 2: ప్రకాశం జిల్లా దొనకొండలో త్వరలో 2,500 ఎకరాల్లో వాహనాల విడిభాగాలు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పెయిన్ దేశానికి చెందిన ఇడియాడ కంపెనీ బృందం డైరెక్టర్లు మందీప్‌టాక్, లూయిస్ తెలిపారు. గురువారం వారు దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు, రుద్రసముద్రం, పోచమక్కపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి మ్యాపుల ద్వారా తహశీల్దార్ కె వెంకటేశ్వర్లు, సర్వేయర్ వెంకటరావు వివరించారు. వారు రవాణా, విద్యుత్, రైల్వే, నీటి వసతి, విమానాశ్రయం తదితర వౌలిక వసతుల గురించి ఆరా తీయగా, తహశీల్దార్ స్పందిస్తూ మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం 30 వేల ఎకరాల భూములను సేకరించిందన్నారు. అందులో ఏరోస్‌స్పేస్ సంస్థ ఐదు వేల ఎకరాల్లో యుద్ధ వినామాల సంస్థ విడిభాగాల పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని, మరికొన్ని సంస్థలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూములను పరిశీలించాయని చెప్పారు. దొనకొండలో రైల్వేస్టేషన్‌తోపాటు విమానాశ్రయం అభివృద్ధి జరుగుతోందని భారీ విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా స్పెయన్ ప్రతినిధులకు తెలిపారు. దొనకొండ నుంచి అమరావతితోపాటు అద్దంకి వరకు, నాలుగు లైన్ల రహదారులను నిర్మిస్తున్నారని, అమరావతి నుంచి అనంతపురానికి ఆరు లైన్ల రవాణా సౌకర్యం ఏర్పాటవుతోందని తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు ఇక్కడి భూములు తమకు నచ్చాయని, త్వరలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతులు పొందుతామని చెప్పారు.

చిత్రం.. రుద్రసముద్రంలో ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్న స్పెయిన్ బృందం