బిజినెస్

జియో ప్రస్తుత కస్టమర్లకు అదనంగా మరో 5 జిబి డేటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. తమ ప్రస్తుత (ప్రైమ్) కస్టమర్లకు మరింత డేటాను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 303 రూపాయలతో రీచార్జ్ చేసుకునేవారికి అదనంగా 5 జిబి డేటా లభించనుంది. ఈ నెల 31తో ఉచిత డేటా ఆఫర్ ముగియనున్న క్రమంలో ఇప్పటిదాకా ఉన్న కస్టమర్లకు 99 రూపాయల ప్రవేశ రుసుముతో ఏడాదిపాటు నెలకు 303 రూపాయలకే 28 జిబి డేటాను అందిస్తామని ఇప్పటికే జియో ప్రకటించినది తెలిసిందే. అయితే వీరందరికీ 28 జిబి డేటాతోపాటు అదనంగా మరో 5 జిబి డేటా నెలనెలా ఇస్తామని శుక్రవారం జియో ప్రకటించింది. ఈ 303 రూపాయల ప్యాకేజిలో అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ (ఎస్‌టిడి, రోమింగ్), టెక్స్ట్ మెసేజ్‌లు కూడా ఉన్నది తెలిసిందే. ఇదిలావుంటే దేశీయ డేటా మార్కెట్ 2020-21 నాటికి 3 లక్షల కోట్ల రూపాయలను చేరుతుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అంచనా వేసింది. ఈ క్రమంలో 50 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.