బిజినెస్

ఒకే రోజు చేతులు మారిన రూ. 50 లక్షల కోట్ల రిలయన్స్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)లో గురువారం ఒకే రోజు 50 వేల కోట్ల రూపాయల విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చేతులు మారాయి. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూపు సంస్థల మధ్య షేర్‌హోల్డింగ్స్‌లో భారీ మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ కంపెనీ షేర్లు భారీ ఎత్తున చేతులు మారాయి. బిఎస్‌ఇ వెబ్‌సైట్ వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం సమయానికే 51 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లు ట్రేడ్ అయ్యాయి. గత రెండు వారాల్లో సగటున రోజుకు 11 లక్షల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లుమాత్రమే ట్రేడ్ అవుతుండగా గురువారం దాదాపు 40 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేరు క్రితం రోజు ముగింపుతో పోలిస్తే స్వల్ప నష్టంతో రూ. 1,281.70 రూపాయల వద్ద ముగిసింది. కంపెనీకి చెందిన 15 ప్రమోటర్ గ్రూపు కంపెనీలు 118.99 కోట్ల షేర్లను షేరుకు రూ. 1100.78 ధర చొప్పున మరో ఎనిమిది ప్రమోటర్ కంపెనీలకు బదిలీ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ నెల 2న ప్రకటించిన విషయం తెలిసిందే.