బిజినెస్

బ్యాంకులతో చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: బ్యాంకులతో వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు సిద్ధమని లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యా.. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యే విదేశాలకు పారిపోయారన్న అపవాదును మోస్తున్నదీ విదితమే. అయితే రుణాల చెల్లింపులకు సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధమేనని శుక్రవారం ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.
బకాయల వసూళ్లలో భాగంగా తనఖా పెట్టిన ఆస్తులను అమ్మేందుకు బ్యాంకర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా ఆఫర్ వచ్చింది. ఆస్తుల వేలానికి ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. ఇటీవల కూడా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు ప్రధాన స్థిరాస్తులను బ్యాంకర్లు వేలం వేయగా, ఎప్పట్లాగే వేలం విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరూ కొనేందుకు ముందుకు రాలేదు. ఇప్పటిదాకా పలుమార్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్థిర, చరాస్తులను వేలం వేసిన బ్యాంకులకు నిరాశే మిగలగా, చివరకు వేలానికి వేలానికి ఆస్తుల ధరలను తగ్గిస్తున్నా ఫలితం శూన్యం. మొన్నటికిమొన్న ముంబయలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను, గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను బ్యాంకులు వేలానికి తీసుకురాగా, భంగపాటు తప్పలేదు. కింగ్‌ఫిషర్ హౌస్‌ను వేలం వేయడం ఇది నాలుగోసారైతే, కింగ్‌ఫిషర్ విల్లా వేలం మూడోసారి. వీటి ధరలనూ గత వేలంతో పోల్చితే మరింతగా తగ్గించారు. కింగ్‌ఫిషర్ హౌస్ ధరను 103.50 కోట్ల రూపాయలుగా నిర్ణయంచారు. నిజానికి నిరుడు మార్చిలో తొలిసారి నిర్వహించిన వేలంలో దీని ధర 150 కోట్ల రూపాయలుగా ఉంది. నాడు స్పందన కరువవడంతో రెండోసారి ఆగస్టులో వేసిన వేలంలో 135 కోట్ల రూపాయలకు తగ్గించారు. అయనా ఫలితం లేకపోవ డంతో మూడోసారి డిసెంబర్ వేలంలో 115 కోట్ల రూపా యలకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా బ్యాంకులకు నిరాశే ఎదురవడంతో 10 శాతం మేర ధర తగ్గించి 103.50 కోట్ల రూపాయలుగా నిర్ణయంచారు. ముంబయ జాతీయ విమానాశ్రయం దగ్గర్లోగల విలే పార్లే ప్రాంతంలో 17 వేల చదరపు అడుగుల్లో నిర్మితమైంది కింగ్‌ఫిషర్ హౌస్. ఇక కింగ్‌ఫిషర్ విల్లా విషయానికొస్తే దీని ధరను 73 కోట్ల రూపాయలకు తగ్గించాయ బ్యాంకులు. నిరుడు డిసెంబర్ నెల వేలంలో 81 కోట్ల రూపాయలుగా ఉన్న దీని ధర.. అక్టోబర్‌లో 85.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దగల కింగ్‌ఫిషర్ విల్లా 12,350 చదరపు గజాల్లో నిర్మించారు.
బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. కాగా, నిరుడు మార్చి 3న లండన్‌కు మాల్యా చెప్పాపెట్టకుండా వెళ్లిపోగా, అడపాదడపా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. 2012లో దేశీయ ప్రైవేట్‌రంగ సంస్థ అయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి. మాల్యా వ్యవహారం కోర్టుల్లో నడుస్తున్నందునే కొనేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ. లీగల్‌గా సమస్యలు వస్తాయన్న భయాలు కొనుగోలుదారుల్లో ఉండగా, ధరలు కూడా అధికంగా ఉన్నాయన్న భావనా పలువురిలో వ్యక్తమవు తోంది. మరోవైపు రుణాల చెల్లింపుల్లో వైఫల్యంపై సుప్రీం కోర్టులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా.. తన విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సరైన విచారణ లేకుండానే తనను దోషిగా చిత్రీకరించిందన్నారు. కాగా, మాల్యా తన ఆస్తులను వెల్లడిస్తూ సమర్పించిన వివరాలపై సుప్రీం కోర్టు గురువారం వివిధ ప్రశ్నలను లేవనెత్తింది. ఈ వివరాలు వాస్తవమైనవా? కాదా? అని జస్టిస్ ఎకె గోయల్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. కర్నాటక హైకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి మాల్యా తన ముగ్గురు పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేశాడని బ్యాంకుల కన్సార్టియం ఆరోపించడంతో సుప్రీం కోర్టు ఈ ప్రశ్న సంధించింది. అలాగే విదేశీ సంస్థ డియాజియో నుంచి పొందిన ఈ 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేయాలంటూ మాల్యాను ఆదేశించాలని, కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లు వేసిన రెండు పిటిషన్లపైనా ఆదేశాలను సుప్రీం రిజర్వు చేసింది. కాగా, ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులున్నాయ. బ్యాంకర్ల తరఫున ఎస్‌బిఐ క్యాపిటల్ ట్రస్టీ మాల్యా ఆస్తుల వేలాలను నిర్వహిస్తోంది.