బిజినెస్

మరోసారి వేలానికి జివికె ల్యాండ్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తమిళనాడులోని జివికె పెరంబలూర్ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోగల జివికె గ్రూపునకు చెందిన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంకు ప్రకటించింది. జివికె సంస్థ నుంచి 175 కోట్ల రూపాయల రుణాలను రికవరీ చేసేందుకే ఈ ల్యాండ్ బ్యాంక్‌ను వేలం వేస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ అధికారులు ప్రకటించారు. 2,500 ఎకరాల్లో విస్తరించిన ఈ సెజ్‌లో జివికె గ్రూప్ భూమికి రిజర్వు ధరగా 257 కోట్ల రూపాయలను నిర్ణయించినట్లు బ్యాంకు శుక్రవారం ఓ నోటీసులో పేర్కొంది. జనవరిలో నిర్వహించిన వేలం విఫలం కావడంతో, ఈ నెల 27వ తేదీన ఇ-వేలంను ప్రారభించనున్నట్లు చెప్పింది.
కాగా, జివికె పవర్ ఇన్‌ఫ్రా సంస్థ 2016 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య 8.9 కోట్ల రూపాయలను చెల్లించిందని అధికారులు తెలిపారు. 2015 డిసెంబర్‌లో తమ బ్యాంకు 156.76 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసు ఇచ్చిందని, వడ్డీలతో కలిపి ప్రస్తుతం రుణం విలువ 175.08 కోట్ల రూపాయలకు చేరిందని బ్యాంక్ అధికారులు వివరించారు. మరోవైపు బకాయిలు చెల్లించేందుకు తగిన ఫార్ములాను రూపొందిస్తున్నామని జివికె వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని వారాల్లో బకాయిలు చెల్లించేందుకు బ్యాంకు వర్గాలతో చర్చించనున్నట్లు జివికె చెబుతోంది.