బిజినెస్

గ్రీక్ యోగర్ట్ ఆవిష్కరణతో డెయిరీ పోర్ట్ఫోలియోను విస్తరించిన డానన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: అగ్రశ్రేణి ఆహారోత్పత్తుల సంస్థ డానన్.. గ్రీక్ యోగర్ట్ ఆవిష్కరణతో తమ డెయిరీ పోర్ట్ఫోలియోను విస్తరించింది. వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన ఆహారం ద్వారా ఆరోగ్యం సమకూర్చా లనే లక్ష్యంతో సమతుల్య జీవనశైలికి అనుగుణంగా అదనపు విలువలు అందించే ఉత్పత్తులనివ్వడానికి కట్టుబడి ఉన్నామని డానన్ ఇండియా ఎండి రోడ్రిగో లిమా తెలిపారు. మార్కెట్‌కు గ్రీక్ యోగర్ట్ పరిచయం సందర్భంగా లిమా మాట్లాడుతూ ఈ నూతన ఉత్పత్తి విడుదలతో డెయిరీ విభాగం వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డానన్ డెయిరీ దేశీయ మేనేజర్ మంజరి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ భారతీయులు ఈ యోగర్ట్‌ను అధిక పోషక విలువల కారణంగా ఇష్టపడగలరన్నారు. డానన్ గ్రీక్ యోగర్ట్ ఇప్పుడు బ్లూ బెర్రీ, మ్యాంగో ఫ్లేవర్స్‌లో కూడా లభిస్తుందని ఇది కేవలం ప్రకృతి సిద్ధమైన పదార్థాలు, పండ్ల ముక్కలతోనే తయారవుతుందని తెలిపారు. అధిక ప్రోటీన్‌లు కలిగి ఉండడంతోపాటు సాధారణ ఫ్రూట్ యోగర్ట్‌తో పోలిస్తే అతి తక్కువ కొవ్వును కలిగి ఉంటుందని ఉపాధ్యాయ్ వెల్లడించారు.