బిజినెస్

దేశీయంగా రోమింగ్ చార్జీలను ఎత్తివేసిన ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ప్రముఖ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్.. దేశీయ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను ప్రకటించింది. అలాగే అంతర్జాతీయ రోమింగ్‌పై సరికొత్త చార్జీల ప్యాకేజీలనూ ఆవిష్కరించింది. విదేశాలకు వెళ్ళేవారికి ఇక బిల్లులకు సంబంధించి ఎలాంటి షాకులూ ఉండబోవంది. ప్రత్యర్థి టెలికామ్ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే ఈ తరహా ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఆదివారం అదే బాటలో ఐడియా కూడా నడుస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ ఆఫర్ అమల్లోకి వస్తుందని తెలిపింది.