బిజినెస్

ఐసిఐసిఐ, ఎస్‌బిఐలో మోసాలెక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: మోసాల జాబితాలో దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం నిరుడు ఏప్రిల్-డిసెంబర్ మధ్య 455 ఫ్రాడ్ కేసుల్లో ఐసిఐసిఐ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ 429 కేసులతో రెండో స్థానంలో ఉండగా, స్టాండర్డ్ చార్టర్డ్ (244), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (237) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో యాక్సిస్ బ్యాంక్ (189), బ్యాంక్ ఆఫ్ బరోడా (176), సిటి బ్యాంక్ (150) కూడా ఉన్నాయి.