బిజినెస్

వాణిజ్య, ఎక్సైజ్ ఆదాయంపై గంపెడాశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్, అమ్మకం పన్నుపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత రెండేళ్లతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరం వాణిజ్యం, అమ్మకం పన్నుల ద్వారా 46,500 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ శాఖ ద్వారా 9 వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 29,846 కోట్ల రూపాయల అమ్మకం పన్ను రాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18లో అదనంగా దాదాపు 17 వేల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది. ఎక్సైజ్ ద్వారా 2015-16లో 3,809.07 కోట్ల రూపాయల ఆదాయం రాగా, 2017-18లో అదనంగా 5 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం పెరిగేలా లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం 1,13,083.04 కోట్ల రూపాయలు వస్తుందని, రెవెన్యూ ఖర్చు 1,08,511.73 కోట్ల రూపాయలుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రెవెన్యూ మిగులు 4,572.21 కోట్ల రూపాయలుగా ఉంటుంది. మొత్తం రెవెన్యూలో పన్నులు, సుంకాల కేటగిరీలో కేంద్ర పన్నుల ద్వారా 17,005 కోట్ల రూపాయలు, రాష్ట్ర పన్నులు, సుంకాల ద్వారా 62,619 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
పనే్నతర ఆదాయంలో వడ్డీ ద్వారా 80.92 కోట్ల రూపాయలు, ఇతర పనే్నతర ఆదాయం (కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకుని) 33,378.12 కోట్ల రూపాయలుగా వస్తుంది. మొత్తం రెవెన్యూ 1.13 లక్షల కోట్ల రూపాయలని అంచనా వేశారు. కాగా, ఇందులో ఖర్చును ఇలా చూపించారు. అభివృద్ధి పనుల నిమిత్తం 77,160.32 కోట్ల రూపాయలు, రుణాల కింద చెల్లింపులకు 11,338.61 కోట్ల రూపాయలు, పరిపాలన సేవలకు 6,672.52 కోట్ల రూపాయలు, పన్ను వసూళ్ల చార్జీల కింద 717.53 కోట్ల రూపాయలు, ఇతర ఖర్చుల కింద 12,622.75 కోట్ల రూపాయలను చూపించారు. మొత్తం 1.08 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఖర్చని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వానికి 2015-16లో 76,133.83 కోట్ల రూపాయల రెవెన్యూ రాగా, 75,895.74 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. 238.09 కోట్ల రూపాయల మిగులు ఉన్నట్లు ప్రకటించింది. 2016-17లో 87,069.78 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆంచనా వేయగా 86,870.38 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. మిగులు 199.40 కోట్ల రూపాయలుగా తేల్చింది. 2015-16 నుంచి 2017-18 వరకు వరుసగా మూడేళ్ల అంచనాలను కలుపుకుని విశే్లషిస్తే రెవెన్యూ రాబడి 37 వేల కోట్ల రూపాయలు పెరగనుంది. 2017-18 రెవెన్యూ ఆదాయంలో పన్నులు, సుంకాల వాటా 70.41 శాతంగా ఉంది. ఇందులో కేంద్రం ఇచ్చే పన్నులు, రాష్ట్ర పన్నుల వాటా 55.37 శాతం. వచ్చే ఏడాది భూమి శిస్తు ద్వారా 15 కోట్ల రూపాయలు, ఇతర మార్గాల ద్వారా 7,104 కోట్ల రూపాయలు, పనే్నతర ఆదాయం 6601.37 కోట్ల రూపాయలు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది.