బిజినెస్

బీఆర్‌పీ పైప్స్-్ఫట్టింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: బీఆర్‌పీ పైప్స్, ఫిట్టింగ్స్.. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత సుమ కనకాలను నియమించుకుంది. 25 సంవత్సరాలకుపైగా వ్యాపారానుభవం కలిగిన ఈ సంస్థ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. 2022 నాటికి 1,000 మంది ఉద్యోగులను నియమిస్తామని సంస్థ సిఎండి ప్రకాశ్ పట్వారీ తెలిపారు.
మార్కెట్లకు మోదీ జోష్
ౄ రెండేళ్ల గరిష్ఠానికి సూచీలు
ౄ సరికొత్త స్థాయకి చేరుకున్న నిఫ్టీ
ౄ యుపి విజయంతో కొనుగోళ్ల హుషారులో మదుపరులు
ౄ సెనె్సక్స్ 496, నిఫ్టీ 152 పాయింట్లు వృద్ధి
ౄ 16 నెలల గరిష్ఠ స్థాయికి రూపాయి విలువ
ముంబయి, మార్చి 14: ఊహించినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఘన విజయం.. మదుపరుల్లో కొనుగోళ్ల జోష్‌ను నింపింది. శనివారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రావడమే కాకుండా, రికార్డు స్థాయిలో సీట్లు దక్కినది తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌లోనూ బిజెపి అధికారం చేజిక్కించుకోగా, పంజాబ్‌లో మాత్రం కోల్పోయింది. అయితే స్పష్టమైన మెజారిటీ రాని గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఇతరుల సాయంతో అధికారాన్ని బిజెపి హస్తగతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కారు మరిన్ని సంస్కరణలను తెస్తుందన్న ఆశాభావం మదుపరుల్లో సర్వత్రా కనిపిస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యత ఉన్నది తెలిసిందే.
అయితే రాజ్యసభలో మెజారిటీ లేని కారణంగా కీలక బిల్లులు, సంస్కరణల అమలు ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ విజయం రాజ్యసభలో బిజెపి బలాన్ని గణనీయంగా పెంచనుంది. దీంతో ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరిన్ని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడతారన్న సంకేతాలు మార్కెట్ అంతటా వ్యాపించాయి. ఫలితంగా మూడు రోజుల వరుస సెలవుల తర్వాత మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో సూచీలు పరుగులు పెట్టాయి.
ఉదయం ఆరంభం నుంచే మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచడంతో సూచీలు రికార్డు స్థాయిలను చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 615.70 పాయింట్లు ఎగబాకి 29,561.93 స్థాయిని తాకగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 188.20 పాయింట్లు ఎగిసి 9,122.75 స్థాయిని అందుకుంది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో నిఫ్టీకి ఇదే ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దీంతో అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ రెండూ కూడా 2015 మార్చి 4 నాటి స్థాయిలను చేరినట్లైంది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ లాభాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, చివరకు ఘనమైన లాభాలనే సొంతం చేసుకోగలిగాయి. సెనె్సక్స్ 496.40 పాయింట్లు పుంజుకుని 29,442.63 వద్ద ముగియగా, నిఫ్టీ 152.45 పాయింట్లు అందిపుచ్చుకుని 9,087 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి ఇది ఆల్‌టైమ్ ముగింపు హై కావడం విశేషం. దీంతో 2015 మార్చి 3నాటి 8,996.25 పాయింట్ల ఆల్‌టైమ్ ముగింపు హై రికార్డు చెరిగిపోయినట్లైంది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. 78 పైసలు అందుకుని 65.82 రూపాయల వద్ద రూపాయి విలువ స్థిరపడింది. ఉదయం ప్రారంభం నుంచే ఫారెక్స్ మార్కెట్ దూకుడుగా ఉండగా, మొదట్లోనే 42 పైసలు ఎగబాకి 66.18 వద్దకు చేరింది. సమయం గడుస్తున్నకొద్దీ ఈ స్థాయి మరింత పెరిగింది. ఈ ఉత్సాహం స్టాక్ మార్కెట్లనూ తాకింది. దీంతో నూతన రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక సంస్కరణల విషయంలో నరేంద్ర మోదీ రాజీ పడరన్నది పాత పెద్ద నోట్ల రద్దుతోనే స్పష్టమైంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పుడే ఇలా నిర్భయంగా తాను అనుకున్నది చేస్తూపోయిన మోదీ.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం నేపథ్యంలో రాజ్యసభలోనూ పెరిగే బలంతో నిర్ణయాల విషయంలో మరింత కఠినంగా ఉంటారని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎటువంటి చర్యలనైనా తీసుకుంటారనే విశ్వాసం మదుపరుల్లో కనిపించింది.
అందువల్లే భారీ పెట్టుబడులతో కదం తొక్కారని మార్కెట్ వర్గాలు మంగళవారం నాటి ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు. ఇకపోతే క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లకు మదుపరుల నుంచి విశేషంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఈ రంగాల షేర్ల విలువ 3.06 శాతం నుంచి 1.60 శాతం వరకు పెరిగింది.
దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ విలువ 5.99 శాతం పెరగగా, హిందుస్థాన్ యునిలివర్ (4.54 శాతం), ఎల్‌అండ్‌టి (4.40 శాతం), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (3.69 శాతం), ఏషియన్ పెయింట్స్ (3.51 శాతం), మారుతి సుజుకి (3.02 శాతం), అదానీ పోర్ట్స్ (2.92 శాతం) షేర్ల విలువ సైతం ఎగిసింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.43 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.19 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షే ఇందుకు కారణం.

చిత్రం..స్టాక్ మార్కెట్ల లాభాలను చూసి సంబరపడిపోతున్న స్టాక్ బ్రోకర్లు