బిజినెస్

‘శక్తిమాన్’తో తెలంగాణ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: శక్తిమాన్ బ్రాండ్ పేరుతో వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలను తయారు చేసే తీర్త్ ఆగ్రో టెక్నాలజీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గురువారం అవగాహనా ఒప్పందం కుదిరింది. తీర్త్ ప్రతినిధులు, పరిశ్రమ శాఖ మంత్రి కెటిఆర్, అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాజ్‌కోట్‌లో ప్రస్తుతం ఒక యూనిట్ ఉంది, వ్యవసాయ యాంత్ర పరిరాలు తయారు చేసే రెండవ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫార్మ్ మిషనరీలో ఉత్పత్తుల్లో 50 శాతం 77దేశాలకు ఎగుమతి చేస్తున్న సంస్థ ఇది. 2016-17లో 725 కోట్ల రెవెన్యూ సాధించారు. రెండువందల ఎకరాల్లో ఫార్మ్ మెషనరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ భారత దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించే చర్యల్లో భాగంగా ఈ యూనిట్ ప్రారంభించినట్టు కంపెనీ ప్రకటించింది. దీని వల్ల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. రైతులకు, వ్యవసాయ విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విధానాలు నేర్చుకోవడానికి ఈ కంపెనీ తొడ్పడుతుంది. రైతులను ఫార్మ్ ఎంటర్‌ప్రైన్యూర్‌లుగా తీర్చి దిద్దడానికి అవసరమైన శిక్షణ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు కంపెనీకి సూచించారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం అని తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు 15 రోజుల్లో అనుమతి ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు.