బిజినెస్

పన్ను ఎగవేతదారుల వివరాలతో పత్రికల్లో ప్రకటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: పన్ను ఎగవేతదారుల పేర్లను వెల్లడించి, తద్వారా వారి పరువు పోగొట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంలో భాగంగా ఆదాయ పన్ను శాఖ శనివారం 29 సంస్థల వివరాలను బహీర్గతం చేసింది. వీటి పన్ను బకాయిలు 448.02 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ప్రముఖ జాతీయ దినపత్రికల్లో ఈ వివరాలకు సంబంధించిన ప్రకటనలను ఐటి శాఖ వేస్తోంది. దీంతో అది తమకు అవమానంగా భావించి పన్ను బకాయిలను చెల్లిస్తున్నారని కూడా ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు కూడా 67 సంస్థల వివరాలను ఇలాగే బయటకు వెల్లడించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పాన్ కార్డు తదితర వివరాలతో ప్రకటనలు వేస్తున్నామని చెప్పారు. కాగా, ఏళ్ల తరబడి పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లలో భాగంగా కొనే్నళ్ల క్రితం నుంచే ఈ తరహా చర్యలకు ఐటి శాఖ శ్రీకారం చుట్టింది.
మరోవైపు పన్ను బకాయిల వసూళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో వాటి వసూళ్లకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆదాయ పన్ను శాఖ అధికారులను ఆదేశించింది. ఎవరినీ ఉపేక్షించరాదని, వేగవంతమైన రికవరీ చర్యలకు ఉపక్రమించాలని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. అన్ని ప్రాంతీయ అధిపతులకు ఈ మేరకు ఓ లేఖను సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర పంపారు. ఫిబ్రవరి నాటికి 3,60,707 కోట్ల రూపాయల పన్నులు వసూలు కావాల్సి ఉందన్న ఆయన 11,846 కోట్ల రూపాయల వసూళ్లే జరిగినట్లు చెప్పారు.