బిజినెస్

ప్రైవేట్ సంస్థలు బిఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీ కావు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 18: ప్రైవేట్‌రంగ సంస్థలు తమకు ఎంతమాత్రం పోటీ కావని, వాటి వల్ల తమ సంస్థకు చేకూరే నష్టం ఏదీ లేదని ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ అన్నారు. తమ సంస్థ సొంతంగా అధునాతన టెక్నాలజీని కలిగి ఉండడంతో వినియోగదారులకు సంతృప్తికరంగా, విస్తృతస్థాయిలో సేవలు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా ఆయన నిజామాబాద్‌ను సందర్శించి స్థానికంగా బిఎస్‌ఎన్‌ఎల్ కార్యక్రమాలు, ఆయా పథకాల అమలుతీరు గురించి కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. బ్రాడ్‌బాండ్ వినియోగదారులకు హైస్పీడ్‌తో ఇంటర్‌నెట్ సేవలందించేందుకు వీలుగా నిజామాబాద్‌లో నూతనంగా నెలకొల్పిన ఎఫ్‌టిటిహెచ్ (ఫైబర్ టు ది హోమ్) టెక్నాలజీని సిజిఎం లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా టెలిఫోన్ లేకపోయినప్పటికీ సెల్‌ఫోన్ నుండే ల్యాండ్‌లైన్ సేవలు పొందేందుకు వీలుగా కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్‌ఎఫ్‌ఎంటి (లిమిటెడ్ ఫిక్స్‌డ్ మొబైల్ టెలిఫోన్) సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిజిఎం మాట్లాడుతూ రిలయన్స్ జియో వంటి సంస్థలు పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బిఎస్‌ఎన్‌ఎల్ సేవల పట్ల వినియోగదారుల్లో ఎనలేని నమ్మకం ఉందన్నారు. వారికి సంతృప్తికరంగా సేవలందించేలా వైఫై హాట్‌స్పాట్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుని ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 4.5జి నెట్‌వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. కాగా, టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ సూచించిన నిబంధనలు, పరిమితులకు లోబడి తమ సంస్థ పనిచేస్తుండటం వల్లే కొన్ని ప్రైవేట్ సంస్థల తరహాలో ఉచిత ఆఫర్లను అందించలేకపోతున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ 15 చోట్ల వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయాలని గుర్తించగా, ప్రస్తుతం రెండు చోట్ల వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారానే ల్యాండ్‌లైన్ సేవలు పొందేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ఎల్‌ఎఫ్‌ఎంటి సేవలకు విశేష స్పందన లభిస్తోందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 366 కనెక్షన్లతో తెలంగాణ సర్కిల్ బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. కాగా, ల్యాండ్ లైన్-49 ప్లాన్ పొందాలనుకునేవారు ఈ నెలాఖరులోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా బ్రాడ్‌బ్యాండ్-249 ప్లాన్‌కు కూడా ఈ నెలాఖరును గడువుగా విధించామన్నారు. ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న వారికి ఇన్‌స్టాలేషన్ రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదని, ప్రతిరోజు 2ఎంబి స్పీడ్‌తో 1జిబి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అంటే ఒక జీబి డాటాకు ఒక రూపాయి కంటే తక్కువ ఖర్చు అవుతుందని అన్నారు. ఎస్‌టివి-339 ప్లాన్‌కు కూడా వినియోగదారుల నుండి, ప్రత్యేకించి యువత నుండి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. విలేఖరుల సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ సిద్దీఖీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జి జగ్‌రాం తదితరులు పాల్గొన్నారు.