బిజినెస్

కింగ్‌ఫిషర్ బకాయిలపై ఏఏఐ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: మూతపడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల మొత్తం దాదాపు రూ .295 కోట్లకు ఎలా చేరుకున్నాయోఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దర్యాప్తు జరపాలని రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఏర్పాటయిన పార్లమెంటు స్థారుూ సంఘం సిఫార్సు చేసింది. ఇప్పుడున్న నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌లైన్స్ బకాయిలు ఇంత భారీగా పెరిగి పోవడానికి ఏఏఐ అనుమతించిందని ఆ కమిటీ అభిప్రాయ పడింది. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2002లో మూతపడిన విషయం తెలిసిందే.మద్యం వ్యాపారి విజయ్‌మాల్య ఈ కంపెనీ ప్రమోటర్‌గా ఉండడం, రుణాల ఎగవేతలాంటి పలు కేసుల్లో భారత అధికారులు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విజయ్‌మాల్యను స్వదేశానికి రప్పించడం కోసం యత్నిస్తున్న విషయం తెలిసిందే. కమిటీ సమర్పించిన నివేదికను ఈ నెల 17న పార్లమెంటు ముందుంచారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలు 294.69 కోట్లకు చేరుకోగా, ఏఏఐ వాటిని రైటాఫ్ చేసింది. అంతేకాకుండా బకాయిలను వసూలు చేయడానికి ఏఏఐ ఆ సంస్థపై ఒక కేసు కూడా వేసింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలు ఇంతగా పేరుకుపోవడానికి బాధ్యులైన అధికారులెవరో నిర్ణయించడం కోసం ఏఏఐ అంతర్గత దర్యాప్తు జరపాలని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. భవిష్యత్తులోఏ వ్యక్తిగత వాటాదారు లేదా ఎయిర్‌లైన్స్ బకాయిలు ఇంత భారీ ఎత్తున పేరుకుపోకుండా ఏఏఐ జాగ్రత్తపడాలని కమిటీ అంటూ, అలాంటి సంఘటనలు తరచూ పునరావృతం కాకుండా చూడడం కోసం వ్యవస్థను, నిబంధనలను బలోపేతం చేయాలని సూచించింది. అంతర్గత దర్యాప్తు నివేదికను ఏఏఐ కమిటీకి తెలియజేయాలని కూడా ఆ నివేదికలో కోరారు. 2016 డిసెంబర్ చివరి నాటికి, ఎయిర్‌లైన్స్ సహా వివిధ సంస్థలనుంచి ఏఏఐకి రావలసిన మొత్తం బకాయిలు రూ.4,579.57 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను రాబట్టడానికి ఏఏఐ నిరంతరం చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ సూచించింది.