బిజినెస్

బ్యాంకులను గట్టెక్కించేందుకు రోడ్‌మ్యాప్ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: బ్యాంకుల్లో మొండి బకాయిలు గణనీయంగా పేరుకుపోతుండటం పట్ల బ్యాంకుల బోర్డు బ్యూరో (బిబిబి) చీఫ్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పురోగతి సాధించలేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ప్రధాన మంత్రిత్వ కార్యాలయానికి (పిఎంఓకి) లేఖలు రాశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రధానంగా పట్టిపీడిస్తున్న నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు రాసిన లేఖలో వినోద్ రాయ్ సూచించారని అధికార వర్గాలు వెల్లడించాయి. జెఎల్‌ఆర్ (జాయింట్ లెండరర్స్ ఫోరమ్)ను ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ జరపడం సహా అందుబాటులో ఉన్న ఇతర వ్యవస్థల ఆధ్వర్యంలో మార్గదర్శకత్వాన్ని అందించేందుకు ఓవర్‌సైట్ కమిటీ పరిధిని విస్తరించాలని వినోద్ రాయ్ తన లేఖలో సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. వీటిలో వౌలిక వసతులు, విద్యుత్, ఉక్కు, రోడ్లు, జౌళి రంగాలకు చెందిన మొండి బకాయిలే అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అరుణ్ జైట్లీ గత వారం రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్లు ఎస్‌ఎస్.ముంద్రా, విరల్ వి.ఆచార్య సహా ఇతర సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

చిత్రం..బిబిబి చీఫ్ వినోద్ రాయ్