బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్ స్మార్ట్ఫోన్ యూజర్లకు 1 జిబి ఉచిత డేటా ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ నాన్ ఇంటర్నెట్ యూజర్లకు ఉచితంగా 1 జిబి డేటాను ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లే అయినప్పటికీ, సంస్థ డేటా సేవలను ఉపయోగించుకోని స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఈ 1 జిబి ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ ప్రత్యేక ఆఫర్ అని స్పష్టం చేసింది. ఇటీవలికాలంలో ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థలతో పోటీపడుతూ డేటా ఆఫర్లను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటిస్తున్నది తెలిసిందే. దీనికి భారీగా స్పందన కూడా వస్తోంది.