బిజినెస్

9 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) 9 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ 659 కోట్ల రూపాయలు. ఇందులో నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్, వొడాఫోన్ ఎఫ్‌డిఐలు కూడా ఉన్నాయి. నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్ ఎఫ్‌డిఐ విలువే 534 కోట్ల రూపాయలు. కాగా, మరో మూడు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సిసిఇఎ)కి ఎఫ్‌ఐపిబి సిఫార్సు చేసింది. వీటిలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్, స్టార్ టెక్నాలజీస్, ఫ్లాగ్ టెలికామ్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్‌డిఐలున్నాయి. కాగా, గత నెల ఫిబ్రవరి 21న ఎఫ్‌ఐపిబి సమావేశం జరిగింది.