బిజినెస్

ఏపి బెవరేజ్ సేవా పన్ను వసూలు ఆదేశాలను ఆపేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఏపి ప్రభుత్వం తరఫున మద్యానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపి బెవరేజ్ కార్పోరేషన్ నుంచి 1,500 కోట్ల రూపాయల సేవా పన్నును వసూలు చేయకుండా సర్వీసు ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 2010-11 నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపి బెవరేజస్ 1,500 కోట్ల రూపాయలకుపైగా సేవా పన్నును చెల్లించాలన్న సేవా పన్ను కమిషనర్ ఆదేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ 2016 నవంబర్ 25వ తేదీన సేవా పన్ను కమిషనర్ ఏపి బెవరేజ్ సంస్థకు నోటీసులు ఇచ్చారన్నారు. ఏపిబిసిఎల్‌పైన సర్వీసు పన్నును లెవీ చేస్తూ వసూలు చేసే పరిధి ప్రిన్సిపల్ కమిషనర్, సేవా పన్ను విభాగానికి లేదని ఆయన కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లు, ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.