బిజినెస్

భారతీయ మార్కెట్‌లోకి లగ్జరీ బ్రాండైన లెక్సస్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ మార్కెట్‌లోకి జపాన్ ఆటోరంగ దిగ్గజం టొయోటా.. తమ లగ్జరీ బ్రాండైన లెక్సస్ కార్లను శుక్రవారం తీసుకొచ్చింది. వీటిలో ఆర్‌ఎక్స్ హైబ్రిడ్ మోడల్ ధర 1.07 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆర్‌ఎక్స్ ఎఫ్ స్పోర్ట్ హైబ్రిడ్ మోడల్ ధర 1.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ సెడాన్ ధర 55.27 లక్షల రూపాయలుగా ఉంది. టాప్ ఎండ్ ఎస్‌యువి ఎల్‌ఎక్స్450డి మోడల్‌నూ సంస్థ పరిచయం చేయగా, దీని ధరను మాత్రం ప్రకటించలేదు. వచ్చే ఏడాది నుంచి దీని అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయ. టాటా మోటార్స్ లగ్జరీ కార్ల బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) లేదా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్లు మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యు, ఆడి, లాంబొర్గిని, పోర్షే తదితర కార్ల ధరల కంటే తమ లెక్సస్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, తాము అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకోలేదని, కస్టమర్లకు ప్రపంచ శ్రేణి కార్లను అందించడమే ప్రధానోద్దేశమని టొయోటా ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. దేశీయంగా ఢిల్లీ, గుర్గావ్, ముంబయ, బెంగళూరుల్లో తొలుత నాలుగు డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు