బిజినెస్

త్వరలో జెఎస్‌డబ్ల్యు పెయింట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 27: రంగుల తయారీ వ్యాపారంలోకి సజ్జన్ జిందాల్ కుటుంబం ప్రవేశించనుంది. ఏషియన్ పెయింట్స్ ఆధిపత్యం కొనసాగుతున్న ఈ వ్యాపారంలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులను జిందాల్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా ఉత్పత్తి మొదలవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్లు, కర్నాటకలోని విజయ్‌నగర్‌లో ఓ కర్మాగారాన్ని, మహారాష్టల్రోని వసింద్‌లో మరొకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సజ్జన్ జిందాల్ కుమారుడు పార్థ్ జిందాల్ చెప్పారు. జెఎస్‌డబ్ల్యు పెయింట్స్ పూర్తిగా కుటుంబ నేపథ్య సంస్థ అని అన్నారు. ఇప్పటికే ఈ కుటుంబం.. జెఎస్‌డబ్ల్యు స్టీల్, సిమెంట్ వ్యాపారాలను చేస్తున్నది తెలిసిందే. ఇవేగాక ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ జెఎస్‌డబ్ల్యు గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రస్తుతం భారతీయ వార్షిక రంగుల తయారీ సామర్థ్యం 25 లక్షల కిలోలీటర్లు. ఇందులో ఏషియన్ పెయింట్స్ వాటానే 10 లక్షల కిలోలీటర్లు. ఈ క్రమంలో 2025 నాటికి 10 లక్షల కిలోలీటర్ల సామర్థ్యాన్ని అందుకోవాలనే లక్ష్యాన్ని జెఎస్‌డబ్ల్యు పెట్టుకుంది. ఇందులో భాగంగానే తొలుత దక్షిణాది రాష్ట్రాల మార్కెట్‌పై దృష్టి పెట్టనున్న జెఎస్‌డబ్ల్యు గ్రూప్.. ఆ తర్వాత పశ్చిమాది రాష్ట్రాల మార్కెట్‌పై ఫోకస్ చేయనుంది. ఈ క్రమంలోనే సమీప భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ రంగుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది జెఎస్‌డబ్ల్యు. సిమెంట్ వ్యాపారం కారణంగా రిటైల్ మార్కెట్‌పై తమకు అవగాహన ఉందని, కాబట్టి తమ ఈ కొత్త రంగుల వ్యాపారం బాగుంటుందనే ఆశాభావాన్ని పార్థ్ జిందాల్ వ్యక్తం చేశారు. ఈ వ్యాపారం ఈయ న ఆధ్వర్యంలోనే జరగనుంది.