బిజినెస్

రూ. 60 వేల కోట్ల ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 9 బిలియన్ డాలర్ల (60 వేల కోట్ల రూపాయలు)కుపైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. భారత్-బం గ్లాదేశ్‌లకు చెందిన వివిధ రంగాల సంస్థలు సోమవారం ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. విద్యుత్, చమురు, గ్యాస్ తదితర రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. కాగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ లిమిటెడ్ (బిఐఎఫ్‌పిసిఎల్), ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఓ ఒప్పందం కుదిరింది. బంగ్లాదేశ్‌లోని రామ్‌పాల్‌లో 1.6 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపడుతున్న 1,320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మైత్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి రుణసాయం కోసం ఈ ఒప్పందం జరిగింది. ఇదిలావుంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వద్ద 750 మెగావాట్ల తొలి దశ పవర్ ప్రాజెక్టు కోసం బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు (బిపిడిపి)తో రిలయన్స్ పవర్ సోమవారం ఒప్పందాలు చేసుకుంది. దాదాపు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇక్కడ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ పెడుతోంది. ఇకపోతే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ భారత్‌తో మరింత వాణిజ్య సంబంధాలను తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగం గా భారత్‌కు హసీనా విచ్చేశారు.