బిజినెస్

సెయిల్ ప్లాంట్లలో ఉద్యోగుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వరంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు చెందిన మూడు యూనిట్లలో ఉద్యోగులు మంగళవారం సమ్మె బాట పట్టారు. ఈ యూనిట్లలో వాటాను ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం ప్రతిపాదించడమే ఈ ఒకరోజు సమ్మెకు కారణమని వాణిజ్య సంఘం ఐఎన్‌టియుసి తెలిపింది. ‘సెయిల్‌కు చెందిన దుర్గాపూర్‌లోగల అల్లాయ్ స్టీల్ ప్లాంట్, చెన్నైలోని సలీమ్ స్టీల్ ప్లాంట్, కర్నాటకలోని మరో స్టీల్ ప్లాంట్‌లో ఐఎన్‌టియుసి, సిఐటియుసహా అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే తమ సమ్మెను ప్రారంభించాయి.’ అని ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టియుసి) జాతీయ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డి పిటిఐకి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఈ ప్లాంట్లలో ఉత్పత్తి జరగడం లేదని చెప్పారు. ఈ ప్లాంట్లకు చెందిన దాదాపు 10,000 మంది సమ్మెకు దిగారని, వీరిలో తాత్కాలిక, కాంట్రాక్టు కార్మికులు కూడా ఉన్నారని వివరించారు. మరో ఏడాదిపాటు సమయం ఇస్తే ఈ ప్లాంట్లను కార్మికులు, అధికారులు లాభాల్లోకి తీసుకువస్తారన్న డిమాండ్‌ను ప్రభుత్వానికి వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.