బిజినెస్

మార్కెట్లకు ఇన్ఫీ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 13: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావాలకు తోడు ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు మదుపరులను కదిలించలేక పోవడంలాంటి పరిణామాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 182 పాయింట్లు నష్టపోయి రెండువారాల కనిష్టస్థాయికి చేరుకోగా, నిఫ్టీ సైతం 9,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిన్నటి ముగింపుకన్నా తక్కువ స్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించాక మరింత పడిపోయింది. 182 పాయింట్లు నష్టపోయిన సూచీ 29,461.45 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 52.65 పాయింట్లు తగ్గి 9,150.80 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 28 తర్వాత సెనె్సక్స్ ఇంతస్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇన్ఫోసిస్ షేరు 3.86 శాతం పడిపోగా, టిసిఎస్, విప్రో షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయి పతనమైనాయి. దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారానికి ఇదే చివరి ట్రేడింగ్ అయింది. ఈ లెక్కన ఈ వారంలో సెనె్సక్స్ 245 పాయింట్లకు పైగా నష్టపోయింది. బిఎస్‌ఇలోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 18 షేర్లు నష్టపోగా, 12 మాత్రం లాభపడ్డాయి.