బిజినెస్

నాలుగు రెట్లు పెరిగిన విలీనాలు, స్వాధీనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీయ కంపెనీల విలీనాలు, స్వాధీనాలు గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగాయి. విలువ లెక్కలో చూసినట్లయితే గత ఏడాదికన్నా మూడు రెట్లు పెరిగాయి. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైంది, అతిపెద్ద విలీనం వొడాఫోన్-ఐడియా కంపెనీల విలీనం కూడా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంమీద ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలీనాలు, స్వాధీనాల విలువ 31.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం విలువలో 80 శాతం వొడాఫోన్-ఐడియా విలీనమే ఉందని గ్రాంట్ థోర్న్‌టన్ ఇండియా సంస్థ భాగస్వామి ప్రశాంత్ మెహ్రా తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం 300 ఒప్పందాలలో కలిసి మొత్తం 33.7 బిలియన్ డాలర్ల మేరకు ఒప్పందాలు జరిగాయని ఆ సంస్థ తెలిపింది. 27 బిలియన్ డాలర్ల విలువ కలిగిన వొడాఫోన్-ఐడియా ఒప్పందం లేకపోయి ఉంటే ఈ మొత్తం గత ఏడాదికన్నా 27 శాతం తగ్గి ఉండేదని కూడా ఆ కంపెనీ తెలిపింది.