బిజినెస్

ఓలాలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థాగత మదుపరి సాఫ్ట్‌బ్యాంక్.. భారతీయ రవాణా స్టార్టప్ ఓలాలో తాజాగా దాదాపు 1,675 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. ఇందులో ఓలా నిర్వహణదారైన ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో 12,895 రూపాయల ప్రీమియం వద్ద 10 రూపాయల ముఖ విలువ కలిగిన 12,97,945 షేర్లను సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్‌ఐఎమ్‌ఐ పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది కూడా ఉంది. కాగా, ఈ పెట్టుబడులతో మార్కెట్‌లో ఓలా ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికా ఆధారిత ఉబర్ క్యాబ్‌కు గట్టి పోటీనిచ్చినట్లైంది. ఇదిలావుంటే విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి పలు భారతీయ సంస్థలు ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. ఈ వారంలో దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం టెనె్సంట్, ఈబే, మైక్రోసాఫ్ట్ నుంచి 1.4 బిలియన్ డాలర్ల నిధులను సేకరించినది తెలిసిందే.