బిజినెస్

స్నాప్‌డీల్‌కు తగిలిన స్నాప్‌చాట్ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చింది’ అన్నది సామెత. ఈ సామెత ఇప్పుడు అక్షరాల రుజువైంది స్నాప్‌డీల్ విషయంలో. అవును మరి.. స్నాప్‌చాట్ సిఇఒ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్నాప్‌డీల్‌కు చుట్టుకున్నాయి. పేర్లు కాస్త అటుఇటుగా ఒకేలా ఉండటంతో స్నాప్‌చాట్.. స్నాప్‌డీల్ ఒక్కటేనని నెటిజన్లు పొరబడ్డారు. భారత్ గురించి, ఇక్కడి మార్కెట్‌పట్ల స్నాప్‌చాట్ సిఇఒ ఇవాన్ స్పైగెల్ చులకనగా మాట్లాడినట్లు వచ్చిన వార్తలతో దేశీయ నెటిజన్లు భగ్గుమన్నారు. స్నాప్‌చాట్ యాప్ వినియోగాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ స్నాప్‌చాట్‌కు బదులుగా ఈ-కామర్స్ వేదిక స్నాప్‌డీల్ యాప్‌ను పెద్ద ఎత్తున నెటిజన్లు తొలగించేశారు. స్నాప్‌చాట్.. స్నాప్‌డీల్ ఒక్కటేనని భావించడమే కారణం. పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో చాలామంది రెండూ ఒక్కటేనని అనుకున్నారు. ఆ క్రమంలోనే స్నాప్‌డీల్ యాప్‌ను తమ మొబైల్స్ నుంచి అన్ ఇన్‌స్టాల్ చేసేశారు. కాగా, సంపన్నుల కోసం మాత్రమే స్నాప్‌చాట్ యాప్ ఉందని, పేదల కోసం కాదని, అందుకే భారత్, స్పెయిన్ వంటి పేద దేశాల్లోకి స్నాప్‌చాట్ యాప్ వెళ్లదని, అక్కడి విస్తరణను పట్టించుకోవడం లేదని తనతో స్నాప్‌చాట్ సిఇఒ స్పైగెల్ అన్నారని ఆ సంస్థ మాజీ ఉద్యోగుల్లో ఒకరు చెప్పినట్లు వార్తలొచ్చాయి. దీంతో భారత్‌లో నెటిజన్లు స్పైగెల్ తీరును ఖండించారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సారథులుగా ఉన్నద భారతీయులేనని గుర్తుచేశారు. ఇక స్పైగెల్ వ్యాఖ్యలకు నిరసనగా తాము స్నాప్‌చాట్ యాప్‌ను తొలగిస్తున్నామంటూ కొందరు స్నాప్‌డీల్ బొమ్మను పోస్టింగ్ చేయడం గమనార్హం. వివిధ యాప్ స్టోర్లపై రివ్యూలిస్తూనే రేటింగ్స్‌ను తగ్గించేశారు. అయితే ఈ పొరబాటును గుర్తించిన కొందరు మాత్రం స్నాప్‌చాట్.. స్నాప్‌డీల్ మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే ప్రయత్నాలు చేశారు. 2015లోనూ ఇలాగే స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్.. దేశంలో అసహనంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపినది తెలిసిందే. చివరకు ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగిస్తున్నట్లు స్నాప్‌డీల్ ప్రకటించాల్సి వచ్చింది.