బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ. 3,990 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3,990 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 18.3 శాతం అధికం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా బ్యాంక్ నికర లాభం 15,253 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16తో చూస్తే ఇది 19.2 శాతం అధికం. ఈ మేరకు శుక్రవారం బ్యాంక్ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బ్యాంక్ డిపాజిట్లపై ప్రభావం చూపిందని, ఫలితంగా ఆదాయం పడిపోయిందని వివరించింది.
మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 6,096 మంది తగ్గారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 84,325కు క్షీణించింది. మున్ముందు ఇది కొనసాగవచ్చన్న సంకేతాలను బ్యాంక్ ఇవ్వడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ 4,581 మంది ఉద్యోగులు తగ్గారు.