బిజినెస్

10 వేలకుపైగా వాహనాలపై ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 21: బిఎస్-3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో 10 వేలకుపైగా వాహనాలు తమవద్దే ఉండిపోయాయని అశోక్ లేలాండ్ శుక్రవారం వాపోయింది. వాతావరణంలో ప్రమాదకర స్థాయికి చేరిన కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా కాలుష్యకారక బిఎస్-3 వాహనాల అమ్మకాలు, వాటి రిజిస్ట్రేషన్లను గత నెలాఖర్లో అత్యున్నత న్యాయస్థానం నిషేధించినది తెలిసిందే. ఈ నిషేధం ఈ నెల 1 నుంచే అమల్లోకి రాగా, మార్చి నెల చివరి రెండు రోజుల్లో ఆటోరంగ సంస్థలు భారీ ఆఫర్లతో అప్పటిదాకా మిగిలిపోయిన బిఎస్-3 వాహనాలను అమ్ముకున్నాయి. అయితే తమవద్ద ఇంకా 10,664 యూనిట్ల వాణిజ్య వాహనాలు అమ్మకుండా మిగిలిపోయాయని హిందుజా గ్రూప్‌నకు చెందిన ఆటోరంగ సంస్థ అయిన అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ వినోద్ కె దాసరి ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అయినప్పటికీ తమ కొత్త ఇంటెలిజెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (ఐఇజిఆర్) టెక్నాలజీద్వారా బిఎస్-3 ఇంజిన్లను.. బిఎస్-4 ఇంజిన్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, దీనివల్ల నష్ట్భారం చాలావరకు తగ్గిపోతోందని అన్నారు. ఇలా ఒక్కో ఇంజిన్ అప్‌గ్రేడ్‌కు దాదాపు 20,000 రూపాయల ఖర్చు అవుతోందని పేర్కొన్నారు.
మరోవైపు కెన్యా, ఐవరీ కోస్ట్‌ల్లోని కొత్త ఉత్పాదక కేంద్రాల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) దాదాపు 600 కోట్ల రూపాయల పెట్టుబడితో క్యాబిన్, ఇంజిన్ సామర్థ్య పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు వినోద్ దాసరి చెప్పారు. తూర్పు ఆఫ్రికా మార్కెట్‌కు కెన్యా తయారీ కేంద్రం, పశ్చిమ ఆఫ్రికా మార్కెట్‌కు ఐవరీ కోస్ట్ ఉత్పాదక కేంద్రం నుంచి వాహనాలు పంపిస్తామన్నారు.

చిత్రం..శుక్రవారం చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతున్న అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినోద్ కె దాసరి