బిజినెస్

దివిస్‌కు యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరిక లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఔషధ రంగ సంస్థ దివిస్ లాబొరేటరీస్.. విశాఖపట్నంలోని తమ ఉత్పాదక కేంద్రానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరిక లేఖను జారీ చేసినట్లు శనివారం తెలిపింది. విశాఖలోని యూనిట్-2కు అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా (యుఎస్‌ఎఫ్‌డిఎ) విభాగం ఈ వార్నింగ్ లెటర్‌ను పంపించినట్లు దివిస్ లాబొరేటరీస్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు చెప్పింది. దీంతో తమ విదేశాంగ ప్రతినిధులతోపాటు నిపుణులు రంగంలోకి దిగి యుఎస్‌ఎఫ్‌డిఎ అభ్యంతరాలను నివృత్తిచేసే పనిలో నిమగ్నమయ్యారని వివరించింది. ఇంతకుమించి అసలు ఆ లేఖలో సంస్థను యుఎస్‌ఎఫ్‌డిఎ ఎందుకు హెచ్చరించిందనే వివరాలను మాత్రం దివిస్ లాబొరేటరీస్ తెలియపరచలేదు.