బిజినెస్

విఫలమైతే జైలుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పెరోల్‌ను సుప్రీం కోర్టు జూన్ 19వ తేదీ వరకు పొడిగించింది. అయితే జూన్ 15వ తేదీలోగా డిపాజిటర్లకు 1,500 కోట్ల రూపాయలు చెల్లించకపోతే మరోసారి జైలుకు పంపుతామని సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వు మేరకు సుబ్రతా రాయ్ గురువారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే గతంలో తాము ఆమోదించిన రోడ్ మ్యాప్ (ప్రణాళిక) ప్రకారం డిపాజిటర్లకు తరచుగా చెల్లింపులు జరపాలని లేదంటే జైలు శిక్షను ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. దీంతో సెబీ-సహారా ఖాతాలో జూన్ 15వ తేదీ నాటికి రూ.1,500 కోట్లు, జులై 15వ తేదీ నాటికి మరో రూ.552.22 కోట్లు డిపాజిట్ చేస్తానని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎకె.సిక్రీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనానికి సుబ్రతా రాయ్ హామీ ఇస్తూ ప్రమాణ పత్రాన్ని (అఫిడవిట్‌ను) దాఖలు చేశారు. నిర్దేశిత గడువులోగా ఈ మొత్తాలను చెల్లించకపోతే మళ్లీ జైలుకు పంపుతామని ధర్మాసనం సుబ్రతా రాయ్‌ని హెచ్చరించింది.
ఇదిలావుంటే, సహారా కేసు వ్యవహారంలో చెన్నైకి ప్రకాష్ స్వామి అనే వ్యక్తిని అరెస్టు చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. ఇంతకుముందు తాము ఆదేశించినట్లుగా 10 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయడంలో ప్రకాష్ స్వామి విఫలమవడంతో కోర్టు ధిక్కార నేరం కింద ఆయనను అరెస్టు చేసి నెల రోజుల పాటు జైలులో ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యూయార్క్‌లో సహారా సంస్థకు చెందిన హోటల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రకాష్ స్వామి గతంలో ఒక విదేశీ సంస్థ తరఫున అఫిడవిట్ దాఖలు చేశాడు. దీంతో ఈ హోటల్ కొనుగోలు కోసం 10 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని పాటించడంలో ప్రకాష్ స్వామి విఫలమవడంతో ఆయనపై ధర్మాసనం ఈ చర్య చేపట్టింది.

చిత్రం..గురువారం సుప్రీం కోర్టు విచారణకు హాజరైన సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్