బిజినెస్

మార్కెట్ల జోరుకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 27: అంతార్జతీయ సానుకూల సంకేతాల కారణంగా గత మూడు రోజులుగా జోరు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం కళ్లెం పడింది. ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణులు, అమెరికా పన్ను విధానాలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల ఫ్రానవంతో పాటుగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠస్థాయికి సూచీలు చేరుకున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో రికార్డు స్థాయికి చేరిన బిఎస్‌ఇ సెనె్సక్స్ 104 పాయింట్లు కోల్పోయింది. నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో మొదలై ఆ తర్వాత మరింత పుంజుకుని ఒక దశలో 30,184.22 పాయింట్లకు చేరిన సెనె్సక్స్ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో పడిపోవడం మొదలైంది. చివరికి 103.61 పాయింట్ల నష్టంతో 30,029.74 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌తో పోలిస్తే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ స్వల్పంగానే నష్టపోయింది. 9.70 పాయింట్లు నష్టపోయి 9,342.15 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, ప్రోత్సాహకరమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రియల్టీ, ఐటి, పెట్రోలియం రంగాలకు చెందిన షేర్ల కొనుగోళ్లకు మదుపరులు ఆసక్తి చూపించారు.
ఇదిలా ఉండగా, బిఎస్‌ఇ ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజి అయిన ఇండియా ఐఎన్‌ఎక్స్ శుక్రవారంనుంచి పది కంపెనీల్లో సింగిల్ స్టాక్ ఫ్యూచర్స్, ఆఫ్షన్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. ఈ పది కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టిసిఎస్‌లాంటి ప్రముఖ కంపెనీలున్నాయి.