బిజినెస్

మరిన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకీకృతమవుతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో ఆరు బ్యాంకులు విలీనమైనది తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని బ్యాంకులు కూడా ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బకాయిల సమస్య తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ ఒక్కటే పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జీత్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకుల్లో చిన్నచిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 21 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయి. నిరుడు డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) లక్ష కోట్ల రూపాయలకుపైగా పెరిగి 6.06 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. విద్యుత్, ఉక్కు, రహదారులు, వౌలిక, టెక్స్‌టైల్ రంగాల సంస్థలు అధికంగా బకాయిపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బిపి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బిటి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె), భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి)లు ఎస్‌బిఐలో విలీనమైయ్యాయ. భారతీయ మహిళా బ్యాంక్ మినహా విలీనమైన మిగతా ఐదు అనుబంధ బ్యాంకుల్లో మూడు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి.
వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ ఉన్నాయి. కాగా, విలీనం నేపథ్యంలో ఎస్‌బిఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు చేరగా, దేశవ్యాప్తంగా దాదాపు 24,000 శాఖలు ఏర్పడ్డాయని, సుమారు 59,000 ఎటిఎమ్‌ల నెట్‌వర్క్ సాధ్యమైందని ఎస్‌బిఐ చెప్పింది. అంతేగాక విలీనానంతర బ్యాంక్‌లో డిపాజిట్ల విలువ 26 లక్షల కోట్ల రూపాయలను దాటిపోతుండగా, అడ్వాన్స్‌ల స్థాయి 18.50 లక్షల కోట్ల రూపాయలను మించుతోంది.
కాగా, 2008లో తొలిసారిగా ఎస్‌బిఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. రెండేళ్ల తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా కలిసిపోయింది.