బిజినెస్

ఇక రోజూ మారుతాయట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇక పెట్రోల్, డీజిల్ ధరలూ రోజూ మారనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఇప్పటివరకూ 15 రోజులకోసారి ధరలను సవరిస్తూపోయిన చమురు మార్కెటింగ్ సంస్థలు.. సోమవారం నుంచి రోజుకోసారి ఈ సవరణలు చేపడుతాయి. అయితే పుదుచ్చెరి, విశాఖపట్నం, ఉదయ్‌పూర్, జంషేడ్‌పూర్, చంఢీగఢ్‌లలో తొలుత ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ మొదట అమలు పరుస్తున్నామని, ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా అమలుంటుందని ప్రభుత్వరంగ చమురు సంస్థల్లో దిగ్గజమైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) స్పష్టం చేసింది.
మరోవైపు ఆదివారం లీటర్ పెట్రోల్ ధర అతి స్వల్పంగా 1 పైస పెరిగితే, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 68.09 రూపాయలకు, డీజిల్ ధర 57.35 రూపాయలకు చేరుతుంది.