బిజినెస్

పెట్టుబడులకు మంచి సమయం ఇదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: భారత్.. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు మంచి సమయం ఇదేనని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ మదుపరులకు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత పర్యటన సందర్భంగా సోమవారం ఇక్కడ ఇండియా-టర్కీ బిజినెస్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాట్లాడిన మోదీ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోందని, ఈ మూడేళ్లలో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర కార్యక్రమాలను చేపట్టామని, పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)సహా ఎన్నో సంచలనాత్మక సంస్కరణలను అమలుపరిచామన్నారు. గత ప్రభుత్వాలేవీ తీసుకోని నిర్ణయాలు తీసుకున్నామని, అందుకే ఎప్పు డూ లేనంతగా విదేశీ పెట్టుబడులకు భారత్ ఇప్పు డు అనుకూలంగా మారిందన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016లో 6.4 బిలియన్ డాలర్లుగా ఉందని, 2008లో 2.8 బిలియన్ డాలర్లుగానే ఉందని చెప్పారు. ఎనర్జీ, మైనింగ్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు.