బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 976.48 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 695.78 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,434.65 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,947.32 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
రిలయన్స్ క్యాపిటల్
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 417 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 415 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 5,086 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,828 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
డాబర్ ఇండియా
దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం డాబర్ ఇండియా ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 333.11 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 331.48 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,979.72 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,063.93 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
డిసిఎమ్ శ్రీరామ్
బహుళ వ్యాపార గ్రూప్ డిసిఎమ్ శ్రీరామ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 156.35 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 54.53 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి రెండింతలకుపైగా పెరిగినట్లైంది. ఆదాయం ఈసారి 1,722.96 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,392.44 కోట్ల రూపాయలుగా ఉంది.