బిజినెస్

ఇక ఎస్‌బిఐ కార్డుతో ఆన్‌లైన్‌లో అద్దె చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధ విభాగమైన ఎస్‌బిఐ కార్డు.. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ రెడ్‌జిరాఫీతో చేతులు కలిపింది. దీంతో ఆన్‌లైన్‌లో రెడ్‌జిరాఫీపై ఇక ఎస్‌బిఐ కార్డుతో నెలసరి అద్దెలు చెల్లించే వీలు కలిగింది. వచ్చే మార్చికల్లా ఎస్‌బిఐ కార్డు వినియోగదారుల్లో కనీసం లక్ష మందిని ఈ ఆన్‌లైన్ రెంటల్ పేమెంట్స్ వేదిక వినియోగదారులుగా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెడ్‌జిరాఫీ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సిఇఒ మనోజ్ నాయర్ తెలిపారు.