బిజినెస్

నిధుల వేటలో ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణను చేపట్టాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లోనే ఈ నిధుల సమీకరణ ఉండే వీలుండగా, ఎంత మొత్తం సేకరిస్తుందోనన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యుఐపి) ద్వారా ఈ నిధుల సమీకరణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆరు మర్చంట్ బ్యాంకర్లనూ నియమిస్తోంది. వివిధ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులను కూడా కోరుతోంది. 2019 మార్చి నాటికి 1.10 లక్షల కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని ఎస్‌బిఐ చూస్తోంది. ఇటీవల ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, ఒక మహిళా బ్యాంక్ విలీనం అయినది తెలిసిందే.
ఉల్లి కొనుగోలుకు సెంట్రల్ మార్కెట్ కమిటీ నిధులు

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ఉల్లిగడ్డల కొనుగోలుకు ఐదు కోట్ల రూపాయలను సెంట్రల్ మార్కెట్ ఫండ్ నుండి వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. మధ్య దళారుల బెడద లేకుండా చూసేందుకు ఆన్‌లైన్‌లోనే ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఉల్లిగడ్డలకు చెల్లించే ధరతో పాటు ఇతర ఖర్చుల కోసం ఈ ఐదు కోట్ల రూపాయలను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వివరించింది.
నిజాం షుగర్స్ చైర్మన్‌గా జయేష్ రంజన్

హైదరాబాద్, మే 9: నిజాం షుగర్స్ లిమిటెడ్ పాలక మండలి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) చైర్మన్‌గా రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టేనని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మార్కెట్ కమిటీల
గడువు పొడిగింపు

హైదరాబాద్, మే 9: ఏడాది క్రింద ఏర్పాటైన ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీల గడువును ఆరు నెలల పాటు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.
2017 మే ఆరు నుండి ఆరు నెలల వరకు గడువు పొడిగింపు అమల్లో ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత వాటి గడువు ఏడాది కాలం ఉంటుంది. నిరుడు మే నెలలో ఏర్పాటైన వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి, బషీరాబాద్, తాండూరు, జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి మార్కెట్ కమిటీలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మార్కెట్ కమిటీల గడువును పొడిగించారు.
చట్టం ప్రకారం ఏర్పాటైన పాలకమండళ్ల గడువును ఒకసారి పొడిగించేందుకు వీలుంది. దాంతో పైన పేర్కొన్న ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల గడువును ఆరు నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సి పార్థసారథి పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆటుపోట్ల మధ్య అరకొర లాభాలు
స్వల్పంగా పెరిగిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబయి, మే 9: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 7.10 పాయింట్లు పెరిగి 29,933.25 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 2.80 పాయింట్లు అందుకుని 9,316.85 వద్ద నిలిచింది. ఇక మంగళవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 30,017.82 పాయింట్లవగా, కనిష్ట స్థాయి 29,911.44 పాయింట్లు. అలాగే నిఫ్టీ గరిష్ఠ స్థాయి 9,338.95 పాయింట్లయితే, కనిష్ట స్థాయి 9,307.70 పాయింట్లు. పెట్టుబడులు పెరగడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతోనే సూచీలు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్స్, పవర్, మెటల్, చమురు, గ్యాస్, ఎనర్జీ, రియల్టీ రంగాల షేర్ల విలువ 1.90 శాతం నుంచి 0.52 శాతం మేర పెరిగింది. మరోవైపు టెలికామ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 0.76 శాతం నుంచి 0.11 శాతం మేర పడిపోయింది.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలకమైన హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, జపాన్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో మాత్రం ప్రధాన సూచీలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లోనే కదలాడాయి.