బిజినెస్

హైదరాబాద్‌లో టౌన్‌హౌస్‌ను ప్రారంభించిన ఒయో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: భారతదేశపు అతిపెద్ద ఆతిథ్య కంపెనీ ఒయో.. హైదరాబాద్‌లో తమ తొలి టౌన్‌హౌస్‌ను ప్రారంభించింది. బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ఒయో వ్యవస్థాపకుడు, సిఇఒ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి ప్రధాన ద్వారం వెనుక.. రోడ్ నెం. 55లో ఈ టౌన్‌హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట వద్ద కూడా ప్రారంభిస్తామన్నారు. ఒయో టౌన్‌హౌస్‌లు.. హోటల్, ఇల్లు, కేఫ్, మర్చండైజ్ స్టోర్ తరహా అనుభూతిని కలిగిస్తాయన్నారు.