బిజినెస్

విస్తరణ బాటలో జిజికె టెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేస్తున్న బిజినెస్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ ‘జిజికె టెక్’ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరించే దిశగా వెళ్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్యాలయాన్ని ఉప్పల్ సెజ్‌లో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిటిఒ శ్యామ్ పాల్‌రెడ్డి తెలిపారు. విస్తరణను వేగవంతం చేస్తూ వెయ్యిమందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ఈ నెల 12న ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గౌరవ అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. జిజికె 2004లో తన కార్యకలాపాలను ప్రారంభించగా, ఈ నూతన కేంద్రంతో హైదరాబాద్‌లో సెంటర్ల సంఖ్య మూడుకు చేరింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ల్లోను సంస్థకు కేంద్రాలున్నాయ. కాగా, ప్రస్తుతం కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన వెయ్యిమందికిపైగా ఇంజినీర్లు పని చేస్తున్నారని, 2020 నాటికి 4 వేల మంది ఉద్యోగులు కలిగిన సంస్థగా ఎదగాలన్నదే కంపెనీ లక్ష్యమని తెలిపారు.

చిత్రం..విలేకరులతో మాట్లాడుతున్న శ్యామ్‌పాల్ రెడ్డి